- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లాలో వైసీపీ నేతల దిగజారుడు చర్యలపై డీజీపీకి వర్ల రామయ్య లేఖ
దిశ, ఏపీ బ్యూరో : చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో మిర్చి పంట తగులబెట్టిన ఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సీతి భూమిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలకు చెందిన మిరప పంట, డ్రిప్ వ్యవసాయ పైపులకు వైసీపీ నాయకుడు ఎస్ శంకర్ రెడ్డి అతని కుమారులు నిప్పుపెట్టి తగులబెట్టారని లేఖలో వర్ల రామయ్య ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక అధికార వైసీపీ నాయకులు వ్యవసాయ పంటలను, పరికరాలను నాశనం చేశారని ధ్వజమెత్తారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సీతి భూమిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిలు టీడీపీ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించారు. దీంతో వైసీపీ నేతలు ద్వేషం పెంచుకున్నారని లేఖలో వివరించారు. అందులో భాగంగానే మోటార్లు, డ్రిప్ ఇరిగేషన్ పైప్‌లైన్, స్టార్టర్లలకు నిప్పుపెట్టి టమాటా, మిర్చి పంటలను ధ్వంసం చేశారని లేఖలో ఆరోపించారు. ఈ అంశంపై బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా పోలీసులు రాజీ కుదిర్చేందుకు వైసీపీ నాయకుల తరపున ఫిర్యాదుదారులతో బేరసారాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని లేఖలో వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు.