అనాథ విద్యార్థికి వడ్ల నందన్న ఆపన్నహస్తం..

by Manoj |
అనాథ విద్యార్థికి వడ్ల నందన్న ఆపన్నహస్తం..
X

దిశ, వికారాబాద్ : వడ్ల నందు.. వికారాబాద్ జిల్లాలో సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఈ పేరు మొదటగా వినిపిస్తుంది. సామాన్యుల కష్టాల్లో చేదోడు వాదోడుగా నిలుస్తూ ఉంటాడు. ఈ మేరకు శుక్రవారం వికారాబాద్ మండలం, గొట్టిముక్ల గ్రామానికి చెందిన అనాథ విద్యార్థి అఖిలేష్ ఉన్నత చదువుల కోసం రూ.20వేలు ఆర్థిక సహాయం చేశాడు. అనాథ అయిన అఖిలేష్ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు.

డిగ్రీ పూర్తి అయిన అనంతరం జాతీయ స్థాయి పరీక్షలో ప్రతిభ కనబర్చడంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఐసీఎఫ్ఐ బిజినెస్ స్కూల్‌లో అడ్మిషన్ సాధించాడు. అడ్మిషన్ కోసం రూ.80వేలు అవసరం అవ్వగా.. మొత్తం కోర్స్ కు రూ.9 లక్షల వరకు అవుతాయి. ఈ విషయం టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా నాయకుడు వడ్ల నందు దృష్టికి తీసుకురావడంతో వారి బంధువులను పిలిచి పెద్ద మనసుతో విద్యార్థి చదువు కోసం రూ.20వేలు ఆర్థిక సహాయం అందించారు. బాలుడికి ఆర్థిక సాయం చేసినందుకు గొట్టిముక్ల ఎంపీటీసీ గోపాల్ వడ్ల నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed