ఉత్తరాఖండ్ సీఎం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతికి కమిటీ

by Vinod kumar |
ఉత్తరాఖండ్ సీఎం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతికి కమిటీ
X

డెహ్రాడూన్: ప్రమాణస్వీకారం చేసిన తర్వాతి రోజే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చేందుకు నిపుణులు కమిటీని ఏర్పాటు చేయాలని గురువారం నిర్ణయించారు. 'యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు సంబంధించి నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది' అని ధామి తెలిపారు. ఈ సమావేశంలో న్యాయవేత్తలు, రిటైర్డ్ జడ్జిలు, మేధావులు పాల్గొన్నారు. తాజా కమిటీ ఏర్పాటు నిర్ణయంతో తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకునేందుకు తొలి ప్రయత్నమని ధామి అన్నారు. ఈ కోడ్ ద్వారా వివాహాలు, విడాకులు, ఇతర విషయాల్లో అందరికీ ఒకే చట్టం వర్తించేలా చర్యలు తీసుకోనున్నారు.

Advertisement

Next Story