- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మసీదు లోపలే లౌడ్ స్పీకర్లు వినియోగించండి'
బెంగళూరు: మసీదులో లౌడ్ స్పీకర్లు ఉపయోగించడంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు, రోగుల ప్రయోజనాలను దృష్టిలో నిర్ణయం తీసుకోవాలని కోరారు. చాలా రోజుల నుంచి ఉదయం, సాయంకాలం సమయాల్లో విద్యార్థులు, రోగులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయనే ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. అంతకుముందు గతవారం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ మసీదుల వద్ద లౌడ్ స్పీకర్లు ఆపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే కొనసాగిస్తే మసీదు బయట హనుమాన్ చాలీసా పెద్ద ఎత్తున్న సౌండ్ తో వినిపిస్తామని అన్నారు. దీనిని ఉద్దేశిస్తూ.. లౌడ్ స్పీకర్లకు కౌంటర్ గా హనుమాన్ చాలీసా వినిపించడానికి ఇది పోటీ కాదని అన్నారు. ఇలాంటివి ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దాడి తీస్తాయని చెప్పారు. ముస్లిం నాయకులు తమ స్థలాల్లో లౌడ్ స్పీకర్లను పరిమితం చేసి, ప్రజలు నివాసాలకు ఇబ్బందులు కలిగించకుండా చూడాలని మంత్రి ఈశ్వరప్ప సలహా ఇచ్చారు.