- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Railway minister Ashwini Vaishnaw: ఆస్తి నష్టం చేయొద్దు.. యువతకు రైల్వే మంత్రి విజ్ఞప్తి..
దిశ, వెబ్‌డెస్క్: Railway minister Ashwini Vaishnaw Appeals Youth Don't Damage Railway Property| కేంద్ర పథకం 'అగ్నిపథ్' స్కీంకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల్లో యువత నిరసనల్లో భాగంగా రైళ్లను, వాహనాలను తగలబెడుతోంది. తమకు కేంద్రం అన్యాయం చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీహార్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైలు బోగీలను యువత తగలబెట్టింది. తారాస్థాయి నిరసనలతో రాష్ట్రాలు యుద్ధభూములను తలపిస్తున్నాయి. పోలీసులు లాఠీ చార్జ్‌లు చేస్తున్నా యువతకు వెనక్కు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిరసన చేస్తున్న యువతకు విజ్ఞప్తి చేశారు. హింసాత్మక నిరసనలకు పాల్పడవద్దని వారికి తెలిపారు. అంతేకాకుండా నిరసన తెలుపుతున్న యువత రైల్వే ఆస్తులను ధ్వంసం చేయొద్దన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొందరు మంత్రి వ్యాఖ్యలపై సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం మంత్రి వ్యాఖ్యలను మద్దతు తెలుపుతున్నారు.