తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై తేల్చి చెప్పేసిన కేంద్ర మంత్రి

by GSrikanth |
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై తేల్చి చెప్పేసిన కేంద్ర మంత్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంటులో వాడివేడి చర్చా జరిగింది. ఈ సందర్భంగా ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పారాబాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిందని, ఇప్పుడు మళ్లీ వడ్ల సేకరణ అంశాన్ని తీసుకొచ్చి రైతులను అయోమయం సృష్టిస్తున్నారని పీయూష్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి దమ్కీ ఇస్తోందంటూ గోయల్ ఆరోపించారు. అంతేగాకుండా, దేశంలోని ఇతర రాష్ట్రాలలో తినగలిగే అంత బియ్యం ఉంటేనే సెంట్రల్ పూల్‌కు మిగులు బియ్యం తీసుకుంటామని, అవసరం లేకుండా బియ్యం తీసుకొని కేంద్రం ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. ముడిబియ్యం( రా రైస్) అయితేనే తీసుకుంటామని, లేదంటే మీ రాష్ట్రంలోనే బియ్యాన్ని పంపిణీ చేసుకోండని తేల్చి చెప్పారు. ఆహార భద్రత పథకం కింద తీసుకునే ముడిబియ్యాన్ని ఎగుమతి చేయలేమని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై టీఆర్ఎంపీ కేకే మండిపడ్డారు.

Advertisement

Next Story