Piyush Goyal: తెలంగాణలో కేసీఆర్ ది ఫెయిల్డ్ గవర్నమెంట్ : పీయూష్ గోయల్

by Nagaya |   ( Updated:2022-08-25 12:56:04.0  )
Union Minister Piyush Goyal Says, Failed Government in Telangana
X

దిశ, డైనమిక్ బ్యూరో : Union Minister Piyush Goyal Says, Failed Government in Telangana| తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ పియూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ ప్రభుత్వం పేదల హక్కులను హరిస్తుందని... అసలు ఆ అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడిది? అంటూ నిలదీశారు. పేదల హక్కులను అడ్డుకోవడం ఘోర పాపం. ప్రభుత్వానికి పేదల పట్ల చింతలేదు. తెలంగాణ సర్కార్ ఫెయిల్డ్ గవర్నమెంట్ అంటూ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ తెలంగాణ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇలా వ్యవహరిస్తుందని అన్నారు. పీఎంజీకేవై కింద తీసుకున్న బియ్యాన్ని టీఆర్ఎస్ సర్కారు పేదలకు ఎందుకు పంపిణీ చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్లే బియ్యం సేకరణను నిలిపివేశాం అని పియూష్ గోయల్ ప్రకటించారు.

ఇది కూడా చదవండి: కలుషిత నీరు తాగడం తో పంజాబ్ సీఎంకు అస్వస్థత

Advertisement

Next Story