- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్..
దిశ, వెబ్ డెస్క్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నది అంతా అబద్ధమని మీడియా ముందు వెల్లడించారు. టీఆర్ఎస్ నేతలు రైతులను తప్పుదోవ పట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఏ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపదన్నారు. అన్ని రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందం మేరకు కేంద్రం బియ్యాన్ని మాత్రమే రాష్ట్రాల నుంచి సేకరిస్తుందని వెల్లడించారు. పంజాబ్ నుంచి కూడా బియ్యాన్ని మాత్రమే సేకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. పంజాబ్ లో అనుసరిస్తున్న విధానమే తెలంగాణ లోనూ అనుసరిస్తున్నామని తేల్చి చెప్పారు.
రైతులను తప్పు దోవ పట్టిస్తూ కేంద్రం పై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చెశారు. ఫిబ్రవరి 22, మార్చి 8, తేదీల్లో నిర్వహించిన సమావేశాలకు ఆహ్వనించినప్పటి తెలంగాణ ప్రభుత్వం హాజరు కాలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రైతులను అడ్డు పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని.. తప్పుడు సమాచారంతో రైతులను ఇబ్బంది పెడుతోందని పీయూష్ గోయల్ మండి పడ్డారు.