- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన అన్అకాడమీ!
న్యూఢిల్లీ: ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ కంపెనీ అన్అకాడమీ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది. వ్యయ నియంత్రణ లో భాగంగా కంపెనీ లో సుమారు 600 మందిని తీసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత వారమే వీరందరికీ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని కోరినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తొలగించబడిన మొత్తం ఉద్యోగుల్లో సంస్థలో పనిచేస్తున్న వారితో పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తున్న వారు కూడా ఉన్నారు. కంపెనీ నెమ్మదిస్తున్న వెంచర్ ఫండింగ్, ఆర్థిక పరమైన ఖర్చులను తగ్గించే లక్ష్యంలో భాగంగా మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మందిని తీసివేసింది. 'అన్అకాడమీ అన్ని విభాగాల్లోనూ వ్యయాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
తొలగించిన వారిలో దాదాపు సగం వరకు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారని, మిగిలిన వారిలో వ్యాపారాభివృద్ధి, అమ్మకాలు సహా ఇతర విభాగల్లోని వారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, తొలగించిన వారిలో కొంతమంది తమకు దీని గురించి తెలియదని, పనితీరు, రేటింగ్‌లకు సంబంధించి తమకు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇవ్వలేదని చెప్పడం గమనార్హం. తాము 12-14 గంటలు పనిచేయాలని కంపెనీ భావిస్తోందని, అలా చేయకపోతే వెళ్లిపోవాలని చెబుతున్నట్టు కొందరు తెలిపారు. మరికొందరు అన్అకాడమీ లో ఎక్కువ పని ఒత్తిడి, సానుకూల వాతావరణం లేదని పేర్కొన్నారు. కాగా, అన్అకాడమీ కంపెనీ 2015లో స్థాపించారు. చాలా తక్కువ సమయంలోనే మెరుగైన ఆదరణను దక్కించుకోవడమే కాకుండా 2021లో టెమాసెక్ నుంచి రూ. 3 వేల కోట్లకు పైగా నిధులను సమీకరించి రూ. 26 వేల కోట్లకు పైగా మార్కెట్ విలువను కలిగి ఉంది.