- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPO కి రాబోతున్న వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీ
దిశ,వెబ్‌డెస్క్: 60 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా ఉమా ఎక్స్‌పోర్ట్స్ IPO మార్చి 28న ప్రారంభం కానుంది. ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) మార్చి 30 వరకు ఉంటుంది. కంపెనీ వ్యవసాయ ఉత్పత్తులు, వస్తువుల మార్కెటింగ్‌లో అగ్రగామిగా ఉంది. సెప్టెంబరు 2021లో డ్రాఫ్ట్ పేపర్‌లను దాఖలు చేసిన ఉమా ఎక్స్‌పోర్ట్స్, IPO ద్వారా దాదాపు రూ. 60 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ వ్యవసాయ ఉత్పత్తులు, చక్కెర, ఎండు మిరపకాయలు, పసుపు, కొత్తిమీర, జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాలు, బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, జొన్నలు, తేయాకు వంటి ఆహార ధాన్యాలు, పప్పులు, సోయాబీన్ మీల్ వంటి వ్యవసాయ ఉత్పత్తులలో, మార్కెటింగ్‌లో అగ్రస్థానంలో ఉంది. ప్రధానంగా శ్రీలంక, UAE , ఆఫ్ఘనిస్తాన్‌లకు చక్కెరను, బంగ్లాదేశ్‌కు మొక్కజొన్నను ఎగుమతి చేస్తుంది.
FY21కి, మొత్తం ఆదాయం ఏడాది క్రితం రూ. 810.31 కోట్ల నుంచి రూ.752.03 కోట్లుగా ఉంది. గత ఏడాది రూ.8.33 కోట్లతో పోలిస్తే ఈ కాలానికి నికర లాభం రూ.12.18 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం ఏడాది క్రితం రూ.19.75 కోట్లతో పోలిస్తే రూ.21.25 కోట్లుగా ఉంది. మొత్తం అప్పు రూ.42.14 కోట్లుగా ఉంది.