- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉక్రెయిన్ చిన్నారి వీపుపై కాంటాక్ట్ డీటెయిల్స్.. కంటతడి పెట్టిస్తున్న ఫొటో
దిశ, ఫీచర్స్: ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో అనేక హృదయ విదారక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎంతో మంది అమాయక పౌరులు ప్రాణాలు విడుస్తున్నారు. వృద్ధులు ఆకలితో అలమటిస్తుండగా.. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు అనాథలవుతున్నారు. ఇదే క్రమంలో తాము చనిపోతే లేదా కుటుంబం చెల్లాచెదురైతే పరిస్థితి ఏంటని గ్రహిస్తున్న అనేక మంది పేరెంట్స్.. ముందు జాగ్రత్తగా తమ పిల్లల జేబుల్లో విజిటింగ్ కార్డ్స్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంచుతున్నారు. ఇలాగే ఓ కుటుంబం తమ చిన్నారి వీపుపై రాసిన అడ్రస్ ఫొటో యావత్ ప్రపంచాన్ని భావోద్వేగానికి గురిచేస్తోంది.
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు తమ పిల్లల సంరక్షణ పై ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే వారిని ఒంటరిగా దూర ప్రదేశాలకు పంపించడం లేదా భూగర్భ సబ్‌వే స్టేషన్స్‌లో దాచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ కళాకారిణి సాషా మకోవియ్.. తన కుమార్తె వెరా వీపుపై ఇంటి అడ్రస్, ఫ్యామిలీ కాంటాక్ట్ నెంబర్స్, పుట్టిన తేదీ వంటి వివరాలను రాసింది. ఒకవేళ యుద్ధ సమయంలో తాను చనిపోయి వెరా మాత్రమే బతికుంటే ఎవరైనా ఇతర కుటుంబ సభ్యులు వెరాను కనెక్ట్ చేస్తారనే ఆశతోనే ఇలా రాసినట్లు ఆమె పేర్కొంది. ఉక్రెయిన్ ప్రజల ప్రస్తుత పరిస్థితిని ఈ చిత్రం ప్రతిబింబిస్తుండగా.. ఎంతో మందిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఫొటో చూశాక మాటలు రావడం లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.