ఆహార ఎగుమతులపై ఉక్రెయిన్ బ్యాన్

by Harish |
ఆహార ఎగుమతులపై ఉక్రెయిన్ బ్యాన్
X

కీవ్ : ఉక్రెయిన్ పై రష్యన్ ఆర్మీ వరుసగా బాంబులు, మిసైల్స్ వర్షం కురిపిస్తుండటంతో ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని దేశం సరిహద్దులు దాటుతున్నారు. మరికొందరు మాత్రం ఉక్రెయిన్ ఆర్మీకి అండగా నిలుస్తున్నారు. అయితే, ఇతర దేశాలకు వలస వెళ్తున్న వారిలో అత్యధికంగా మహిళలు, చిన్న పిల్లలు ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. యుద్ధ సంక్షోభంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. దేశంలో ఆహార నిల్వలు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఆహార ఉత్పత్తులు, గోధుమల ఎగుమతులపై ఉక్రెయిన్ బ్యాన్ విధించింది. అంతేకాకుండా పశువుల నుంచి తయారయ్యే ఆహార ఉత్పత్తులు, మాంసం ఎగుమతులను కూడా నిషేధం విధించినట్లు పలు అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. దీనిపై ఉక్రెయిన్ మంత్రి రోమన్ లెష్చెంకో స్పందిస్తూ 'క్లిష్టమైన ఆహార ఉత్పత్తులలో, జనాభా అవసరాలను తీర్చడానికి ఎగుమతులపై నిషేధం అవసరం' అని వెల్లడించారు.

Advertisement

Next Story