మ‌రోసారి ఉక్రెయిన్ వెళ్లిన యూకే ప్ర‌ధాని బోరిస్‌.. ఈసారి అందుకే..?!

by Sumithra |
మ‌రోసారి ఉక్రెయిన్ వెళ్లిన యూకే ప్ర‌ధాని బోరిస్‌.. ఈసారి అందుకే..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ శుక్రవారం ఉక్రెయ‌న్ రాజ‌థాని కీవ్‌ను సందర్శించారు. రెండు నెలల కాలంలో రెండోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీని కలవ‌డంతో ఈ ప‌ర్య‌ట‌న ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. ఇటీవ‌ల యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్‌ను త‌మ కూట‌మిలో క‌లుపుకోడానికి అంగీకరించడానికి సుముఖత వ్యక్తం చేసిన త‌రుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు UKతో కొన‌సాగిస్తున్న సంబంధాల ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా బోరిస్ జాన్స‌న్‌ను స్వాగ‌తించిన ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ, "ఈ యుద్ధ కాలంలో ఉక్రెయిన్‌కు గ్రేట్ బ్రిటన్ మద్దతు దృఢంగా ఉందని రుజువు చేసింది" అని చెప్పాడు. రష్యా దళాలను కీవ్ న‌గ‌రం నుండి వెనక్కి త‌రిమేసిన‌ కొద్ది వారాల తర్వాత బ్రిటిష్ ప్రధాన మంత్రి ఏప్రిల్‌లో కైవ్‌ను సందర్శించగా, ఇది రెండ‌వ ప‌ర్య‌ట‌న. ఇందులో భాగంగా, బ్రిటీష్ ప్రభుత్వం ప్రతి 120 రోజులకు ఒక‌సారి ఉక్రెయిన్ సైనికులకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని బోరీస్ ప్రకటించారు.

ఇది "యుద్ధం సమీకరణాన్ని ప్రాథమికంగా మారుస్తుంది" అని బోరిస్‌ పేర్కొన్నారు. ఆపరేషన్ ఆర్బిటల్ కింద ఉక్రెయిన్ సైనికులు గతంలో UK దళాలతో శిక్షణ పొందగా, రష్యా దళాలతో పోరాడేందుకు యుకె ఇప్పటికే మిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించింది. ఇక‌, అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఉక్రెయిన్‌లో పర్యటించిన కొన్ని రోజులకు ముందు మాక్రాన్ ఒక‌ వివాదాస్పద వ్యాఖ్య కూడా చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా "అవమానం" చెందకూడదని అన్నారు. అయిన‌ప్ప‌ట‌కీ, మాక్రాన్‌తో సమావేశం తర్వాత, జెలెన్స్కీ "అధ్యక్షుడు మాక్రాన్‌తో సంబంధం పారదర్శకంగా, స్పష్టంగా ఉంది" అని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా, రష్యా దళాలతో పోరాడుతున్న ఉక్రెయిక్‌కు ఫ్రాన్స్‌ దీర్ఘ-శ్రేణి సీజర్ హోవిట్జర్లను పంపుతున్నట్లు ప్ర‌క‌టించడం విశేషం.

Advertisement

Next Story