యూకేలో మళ్లీ కరోనా సునామీ.. వారానికి దాదాపు 50 లక్షల కేసులు

by Vinod kumar |
యూకేలో మళ్లీ కరోనా సునామీ.. వారానికి దాదాపు 50 లక్షల కేసులు
X

లండన్: కరోనా పలు దేశాల్లో విజృంభిస్తోంది. గత వారం రోజుల్లో బ్రిటన్‌లో దాదాపు 50 లక్షల మంది వైరస్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పారు. మరోవైపు తాజాగా గుర్తించిన ఎక్స్‌ఈ వేరియంట్ బ్రిటన్ లోనే గుర్తించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.


దేశంలోని ప్రతి 13 మందిలో ఒకరు కరోనా బారిన పడినట్లు తాజాగా గణాంకాలు పేర్కొన్నాయి. అంతకుముందు వారంలో కూడా 40లక్షలకు పైగా మందికి కొవిడ్‌ సోకినట్లు అధికారులు తెలిపాయి. ఈ మధ్యనే యూకేలో ప్రభుత్వం నిబంధనలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు ప్రధాని బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయాలు కూడా కారణమని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ప్రజలు టెస్టులు చేయించుకోవాలి: చైనా ప్రభుత్వం

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో చైనా ప్రభుత్వం చర్యలకు దిగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్న డ్రాగన్ దేశంలో ముఖ్య నగరమైన షాంఘైలో ప్రజలకు కీలక సూచనలు చేసింది. నగరంలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో నగరవాసులు తప్పనిసరిగా స్వీయ పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చింది. ప్రధాన లక్ష్యం వైరస్ గొలుసు వ్యాప్తిని నివారించి, ప్రభావాన్ని తగ్గించడం. దీంతో మేము వైరస్ ను నియంత్రించగలుగుతాం అని షాంఘై మున్సిపల్ హెల్త్ కమిషన్ ఇన్స్‌పెక్టర్ వు కియాన్యు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed