'వరకట్నాన్ని ప్రోత్సహించేలా పుస్తకాల్లో పాఠ్యంశాలు'

by Manoj |
వరకట్నాన్ని ప్రోత్సహించేలా పుస్తకాల్లో పాఠ్యంశాలు
X

న్యూఢిల్లీ: వరకట్న వ్యవస్థపై లాభాలు, ప్రయోజనాలు పేరుతో పుస్తకంలో ప్రచురించడం చర్చకు దారి తీసింది. నర్సింగ్ విద్యార్థులకు సంబంధించిన పుస్తకంలో ఇలాంటి ప్రచురణ ఉన్న పేజీ వైరల్ అయింది. వరకట్నం ప్రయోజనాలు పేరుతో టీకే ఇంద్రాణీ రచించిన సోషియాలజీ పుస్తకం కొత్త చర్చకు దారి తీసింది. దీనికి సంబంధించిన పేజీని షేర్ చేస్తూ శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేదీ విచారం వ్యక్తం చేశారు.

ఇలాంటి బోధనలను పుస్తకాలలో తొలగించాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నాను. 'వాస్తవానికి వరకట్నాన్ని ప్రయోజనకారిగా వివరించే పాఠ్యపుస్తకం మన పాఠ్యాంశాల్లో ఉండటం దేశానికి, రాజ్యాంగానికి సిగ్గుచేటు' అని ట్వీట్ చేశారు. ఫర్నీచర్, రిఫ్రిజిరేటర్లు, వాహనాలు వంటి వాటిని కొత్త గృహాన్ని స్థాపించడంలో కట్నం సహాయకరంగా ఉంటుందని పుస్తకంలోని విభాగం పేర్కొంది. కట్నం వల్లే యువతులు చదువుకోవడం పెరిగిందని ఉంది. అయితే ఉద్యోగం చేసే అమ్మాయి విషయంలో మాత్రం కట్నం తక్కువనేని, ఆకట్టుకునే కట్నాలు ఇస్తే అందం తక్కువ ఉన్నవారికి కూడా పెళ్లిళ్లు అవుతాయని ప్రయోజనాల్లో ఉంది. అయితే సామాజిక మాధ్యమాల్లో ఈ పేజీ వైరల్ గా మారింది. ఇలాంటి పుస్తకాలు విద్యార్థులకు ఇటువంటి పాఠ్యాంశాలు ఉండటం భయంకరంగా ఉందని నెటిజన్లు అన్నారు.

Advertisement

Next Story

Most Viewed