వదినమరదళ్ళ గాజులు పాయే.. బావ బామ్మర్దుల కొత్త ట్రెండ్ షూరు అయే!

by Satheesh |
వదినమరదళ్ళ గాజులు పాయే.. బావ బామ్మర్దుల కొత్త ట్రెండ్ షూరు అయే!
X

దిశ, ముధోల్: తెలంగాణలో సాంప్రదాయాలు అనేకం. సాంప్రదాయలతో మనకుతెలియకుండానే బంధుత్వాలు, స్నేహాలు మరింత బలపడి, ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. తెలంగాణ, నిర్మల్ జిల్లాలోని ముధోల్ తాలూకా ప్రాంతం కొంత మహారాష్ట్ర సరిహద్దుకు అనుకుని ఉండగా, రెండు రాష్ట్రాలకు చెందిన కొన్ని సంప్రదాయాలు ఇక్కడ మిలితంగా కనిపిస్తాయి. ఇప్పటి వరకు తాలూకాలో చలామణి అవుతున్న సాంప్రదాయం "వదిన మరదళ్ళ" గాజులు. ఈ సాంప్రదాయ ప్రకారం మరదళ్లూ వారికి వరుసైన వదినలకు (పుట్టింటి బిడ్డలకు) గాజులు, రెండు జాకెట్ ముక్కలు, రెండు దస్తీలు బహూకరిస్తారు. దీనికి కృతజ్ఞతగా మరదళ్ళకు వదినలు ఎంతో కొంత నగదు లేదా బట్టలు కానుకగా ఇస్తారు.

ఇదంతా ఒక ఏత్తయితే.. ఆడవాళ్ళకేనా సాంప్రదాయాలు.. మేము కూడా జరుపుకుంటాం అంటూ.. కుంటాల మండలంలోని ఓ గ్రామంలో వరసకు బావ బామ్మర్దులయ్యే ఇద్దరు వ్యక్తులు శుక్రవారం బావకు, బామ్మర్ది లుంగీ, ఖర్చీఫ్ బహుకరించారు. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడాలని ఈ కొత్త సంప్రదాయం సృష్టించడంలో మేమే మొదట అని అందులో ఒక వ్యక్తి అంటున్నారు. ఏదేమైనా లుంగీ-దస్తీ బహుకరించుకుంటున్న ఈ ఫోటో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.





Advertisement

Next Story

Most Viewed