- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జోగిపేట జాతిరత్నాలు.. తాగిన మైకంలో పెళ్లి.. కాపురానికి వచ్చిన యువకుడు
దిశ, వెబ్‌డెస్క్ : జాతిరత్నాలు సినిమాలోని జాతి రత్నాల గురించి మనకు తెలిసిందే. కానీ సంగా రెడ్డిజిల్లా జోగిపేటలోని ఈ ఇద్దరు జాతిరత్నాల గురించి తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు.. కానీ ఇక్కడ అంతా రివర్స్.. తాగిన మైకంలో ఇద్దరు యువకులు పెళ్లి చేసుకుని చివరకు పోలీస్టేషన్ మెట్లు ఎక్కారు.
వివరాల్లోకి వెళ్లితే.. మెదక్ జిల్లా చండూరుకు చెందిన 22 ఏళ్ల ఆటోడ్రైవర్‌కు, జోగిపేటకు చెందిన 21 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే వీరిద్దరూ ఎప్పుడూ ఒక కల్లు దుకాణంలో కలిసేవారు.. అలా వీరు మంచి స్నేహితులయ్యారు. కాగా, ఈ నెల 1న అదే కల్లు దుకాణంలో కలుసుకున్న వీరు.. తాగిన మైకంలో చండూరు యువకుడితో జోగిపేట యువకుడు తాళి కట్టించుకున్నాడు. ఆ తర్వాత కాపురానికి వచ్చానంటూ తాళికట్టిన యువకుడి ఇంటిముందు వాలిపోయాడు జోగి పేట యువకుడు. అబ్బాయికి తాళి కట్టడమేంటి? వాడు కాపురానికి వచ్చుడేందని ఆటోడ్రైవర్ తల్లిదండ్రులు తిట్టిపోశారు. తాళి కట్టించుకున్నోడికి సర్దిచెప్పి ఇంటికి పంపేందుకు ప్రయత్నించినా వాడు వినలేదు. నేరుగా.. పోలీస్టేషన్‌కి వెళ్లి నన్ను మోసం చేశాడంటూ జోగిపేట యువకుడు ఫిర్యాదు చేశాడు. లక్ష రూపాయలు ఇస్తేనే కేసు వాపసు తీసుకుంటానని తాళి కట్టించుకున్న యువకుడు తేల్చి చెప్పాడు. . ఇక చివరకు పోలీసులు సర్ది చప్పి 10 వేల రూపాయిలు చెల్లించడంతో యువకుడు కేసు వాపస్ తీసుకున్నాడు.