'బ్రా' వివాదంలో స్టార్ నటి.. ఇస్లాంను అగౌరవపరిచిందంటున్న పాకిస్తాన్ ఫ్యాన్స్

by Harish |   ( Updated:2023-03-24 17:41:09.0  )
బ్రా వివాదంలో స్టార్ నటి.. ఇస్లాంను అగౌరవపరిచిందంటున్న పాకిస్తాన్ ఫ్యాన్స్
X

దిశ, సినిమా: టర్కిష్ సిరీస్ 'డిరిలిస్: ఎర్తుగ్రుల్‌'తో పాపులారిటీ సంపాదించుకున్న నటి 'ఎస్రా బిల్జిక్' తాజాగా బ్రా వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఓ ప్రకటనలో భాగంగా బ్రా, బ్లేజర్ ధరించి కనిపించడంతో ఇస్లాంను అగౌరవపరిచిందంటూ పాకిస్తాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమెపై దుమ్మెత్తిపోస్తూ విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. దీన్ని సిగ్గుచేటు చర్యగా పేర్కొంటూ తనతో బహిరంగంగా క్షమాపణలు చెప్పించి, కఠినంగా శిక్షించాలని టర్కీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతేకాదు కుక్కను ఇంట్లోకి అనుమతించడం ఇస్లాంకు విరుద్ధమని, సంస్కృతిని అగౌరవపరిచే ఇలాంటి వ్యక్తిని ఇంతకాలం ఆరాధించి నిరాశ చెందామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

13వ శతాబ్దానికి చెందిన తమ రాణి పాత్రను పోషించిన ఎస్రాపై తమ గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత కూడా ఉందని గుర్తు చేస్తున్నారు. ఇక 'డిరిలిస్: ఎర్తుగ్రుల్‌'లో 'హలీమ్ సుల్తాన్' పాత్ర పోషించిన ఎస్రా.. పాకిస్థాన్‌తో సహా పలు దేశాల అభిమానుల హృదయాలను గెలుచుకోగా ఈ సిరీస్‌కు గౌరవంగా 'టర్కిష్ గేమ్ ఆఫ్ థ్రోన్స్' అని బిరుదు కూడా ఇచ్చారు ఫ్యాన్స్. అంతేకాదు పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి 'ఇమ్రాన్ ఖాన్'సైతం ఈ సిరీస్‌ను తప్పక చూడాలని పిలుపునివ్వడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed