- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS High Court: సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులకు ఊరట..
దిశ, వెబ్‌డెస్క్: TS High Court Grants Bail to 16 Accused in Secunderabad Riots Case| సికింద్రాబాద్ అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. వీరికి తెలంగాణ హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దీంతో 16 మంది నిరుద్యోగులు బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా, సైనిక నియమాకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఆర్మీ అభ్యర్థులు చేసిన ఈ ఆందోళనలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర హింసాత్మకంగా మారాయి. పలు రైళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టడంతో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఓ అభ్యర్థి మరణించగా.. పలువురు గాయపడ్డారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింసకు పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: రైతు బీమా తరహాలో నేతన్న బీమా పథకం
- Tags
- TS High Court