Governor Tamilisai: భాగ్యలక్ష్మి ఆలయంలో గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ పూజలు

by Nagaya |   ( Updated:2022-08-03 07:13:46.0  )
TS Governor Tamilisai Visits Bhagyalaxmi Temple at Charminar
X

దిశ, చార్మినార్ : TS Governor Tamilisai Visits Bhagyalaxmi Temple at Charminar| చారిత్రాత్మక చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని బుధవారం గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయానికి చేరుకున్న గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్‌కు పూర్ణకుంభంతో భాగ్యలక్ష్మి దేవాలయ ట్రస్టీ చైర్మన్ శశికళ బృందం ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా హారతిలో పాల్గొన్నారు. ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ తమిళ సైను ఆలయ ట్రస్టీ చైర్మన్ శశికళ శాలువాతో ఘనంగా సత్కరించింది.

ఇది కూడా చదవండి: పోటీకి సిద్ధమైన ఆ ఏడుగురు వారసులు



Advertisement

Next Story