- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీఆర్ఎస్ ఉద్యమ నేత స్వచ్ఛందంగా రాజీనామా
దిశ, భద్రాచలం: అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP) మొబైల్ కోర్ట్ - భద్రాచలం కు భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది, టీఆర్ఎస్ ఉద్యమ నేత పడిసిరి శ్రీనివాసరావు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కు తన రాజీనామా పత్రాన్ని పంపించినట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. 11.6.2021న తాను నియమితులై నట్లు తెలిపారు. తన వ్యక్తిగత కారణాల వల్లనే ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన రాజీనామా పత్రాన్ని ఆమోదించాల్సిందిగా కలెక్టర్ ను కోరినట్లు పడిసిరి ఈ సందర్భంగా తెలిపారు. అయితే మరో రెండేళ్లకు పైగానే తన పదవికి గడువు ఉన్నప్పటికీ పడిసిరి.. అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు ఆశ్చర్యానికి లోనయ్యారు. న్యాయవాది పడిసిరి రాజీనామాకు పూనుకోవటం పట్ల మరేదైనా కారణం ఉందా...? అన్నది మిస్టరీగా మారింది. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాది పడిసిరి చురుకుగా పాల్గొన్నారు. అంతేకాదు టీఆర్ఎస్ భద్రాచలం మండల కన్వీనర్ గా కూడా పని చేశారు.