నడిరోడ్డుపై మందు బాటిల్‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగం

by GSrikanth |   ( Updated:2022-03-18 09:28:16.0  )
నడిరోడ్డుపై మందు బాటిల్‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా హోలీ సంబురాలు మిన్నంటాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొని ప్రజల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నారు. కానీ, ఓ ఎమ్మెల్యే మాత్రం హోలీ వేడుకల్లో అత్యుత్సాహం ప్రదర్శించారు. పండుగను ఆదర్శంగా జరుపుకోవాల్సిన ఆయనే నడిరోడ్డుపై హల్‌చల్ చేశారు. మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ హోలీ వేడుక సందర్భంగా కార్యకర్తల నోట్లో మందు పోస్తూ నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులు బంద్ చేసిన సమయంలో మందుతో రోడ్డుపై అడ్డంగా బుక్కయ్యాడు. బాటిళ్లకు బాటిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు గానీ.. హోలీ రంగులతో పాటు లిక్కరూ సప్లై చేశారు. తెరవరా నోరు.. పోయరా మందు అన్నట్టు ఉంది. కార్యకర్తలకు ఆప్యాయంగా ఆయనే నోట్లో లిక్కర్‌ పోస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు.. వాళ్లు దేవతలే అంటూ..


Advertisement

Next Story