- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దొరికిన బండి సంజయ్.. ఓ ఆట ఆడుకున్న బాల్క సుమన్
దిశ, డైనమిక్ బ్యూరో: వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో భారీ నిరసన దీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, రాష్ట్ర ప్రభుత్వం వల్లే ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని, వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద బీజేపీ శ్రేణులు దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా దీక్ష స్థలి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది. వరిధాన్యం కొనుగోళ్లపై దీక్ష చేస్తూ గోధుమలను ఫ్లెక్సీలో ఏర్పాటు చేయడంతో టీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ శ్రేణులు ట్రోల్స్ చేస్తున్నారు. ''వడ్లకు.. గోధుమలకు తేడా తెలియని రాష్ట్ర బీజేపీ నేతలు.. రైతుల ప్రయోజనాలు అంటూ మాట్లాడటం సిగ్గుచేటు. గుజరాత్ గులాములుగా తప్ప.. తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధులుగా వీళ్లు పనికిరారు అన్నది సుస్పష్టం.'' అని ఎమ్మెల్యే బాల్క సుమన్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. వీరితో పాటు, వడ్ల దీక్షకు.. గోధుమల ఫొటోలు అంటూ కాంగ్రెస్ శ్రేణులు ట్వీ్ట్స్ చేస్తున్నారు.
వడ్లకు.. గోధుమలకు తేడా తెలియని రాష్ట్ర బీజేపీ నేతలు.. రైతుల ప్రయోజనాలు అంటూ మాట్లాడటం సిగ్గుచేటు.
— Balka Suman (@balkasumantrs) April 11, 2022
గుజరాత్ గులాములుగా తప్ప.. తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధులుగా వీళ్ళు పనికిరారు అన్నది సుస్పష్టం.#AntiFarmerBJP #OneNationOneProcurement pic.twitter.com/ExODVumG6L