- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ ఒక్క మంచి పని చేసిందా.. మంత్రి
దిశ ప్రతినిధి, సంగారెడ్డి/ ప్రజ్ఞాపూర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక పాలన సాగిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు బీజేపీ చేసిన ఒక్క మంచి పనైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఉత్త కాయకొరుడు మాటలు తప్ప బీజేపీ పార్టీ నేతలు ఒరగబెడుతుందేమిటని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని, మరో 80 వేల ఉద్యోగాలను రానున్న ఏడాదిలో భర్తీ చేయనుందని ఆయన చెప్పారు. అయితే కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను బీజేపీ ఇంతవరకు ఎందుకు భర్తీ చేయలేదని హరీష్‌రావు ప్రశ్నించారు. ఉత్త మాటలకు తప్ప బీజేపీ నేతలు ఎందుకు పనికిరారని విమర్శించారు. కాగా గతంలో మార్చి నెలలో రైతులు ఐదూపది గుంటల్లో ఏదో కూరగాయ పంటలు వేసుకునే వారు. ఈ యాసంగిలో ఒక్క సిద్దిపేట జిల్లాలోనే రెండున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం అన్నీ చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం మాత్రం వారి నుంచి వడ్లు కొనమని చేతులెత్తేసిందని విమర్శించారు.
గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను యాదాద్రి భువనగిరి జిల్లాలోని గండి చెరువుకు, ఆ వెంటనే కొండపోచమ్మ కాలువ ద్వారా కూడవెళ్లి వాగులోకి గోదావరి జలాలను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీష్‌రావు శనివారం విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. మండుటెండల్లో కుడవెళ్లి వాగులోకి నీళ్లు వదలడం సంతోషంగా ఉందన్నారు. వేసవిలో కాల్వల్లో గోదావరి జలాలు పారుతుంటే ప్రతిపక్షాలు మాత్రం కాలేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చారా ? అని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. గత వేసవిలో కూడవల్లి వాగుకు గోదావరి జలాలను విడుదల చేసి 38 చెక్ డాంలను నింపామని మంత్రి గుర్తు చేశారు. దీంతో గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గంలోని 40 వేల ఎకరాల్లో కోట్లాది రూపాయల పంటలను కాపాడగలిగామన్నారు. కాళేశ్వరం జలాలు రాకపోతే ఇది సాధ్యం అయ్యేదేనా అని, రైతులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని అన్నారు. కాళ్లలో కట్టెలు పెట్టి, 350 వరకు కేసులు వేసి ప్రాజెక్టును ఆపడానికి ప్రతిపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేశాయని మంత్రి గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ అన్ని అడ్డంకులను అధిగమించి 618 మీటర్ల ఎత్తుకు గోదారమ్మను తీసుకువచ్చారని, అంతేకాకుండా ఆ నీటితో బీడు భూములను అభిషేకించారని హరీష్‌రావు అన్నారు. మంచినీళ్లు కూడా ఇవ్వలేని వారు, కేసిఆర్‌ను విమర్శిస్తారా..? అంటూ నిలదీశారు. ఇదిలా ఉండగా రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఎకరంలో పంట సాగుచేస్తే లక్షన్నర ఆదాయం వస్తుందన్నారు. పంటను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం బడ్జెట్లో వెయ్యి కోట్ల కేటాయించిందన్నారు. పామాయిల్ మొక్కలతో పాటు డ్రిప్‌ను సబ్సిడీపై అందించి, నాలుగేళ్ల వరకు కూలీలకు డబ్బులను ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో 30 వేల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని మంత్రి సూచించారు. ఇంకా ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌చైర్‌పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఇరిగేషన్ఈఎన్సీ హరిరాం, ఎమ్మెల్సీ డాక్టర్యాదవరెడ్డి, కార్పోరేషన్చైర్మన్ప్రతాప్రెడ్డి, డీసీసీబీ చైర్మన్చిట్టి దేవేందర్‌రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
- Tags
- trs
- bjp
- harish rao