- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana News: టీఆర్ఎస్‌లో ఫుల్ జోష్.. కనీవినీ ఎరుగని రీతిలో వేడుకలు
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: బంటి.. బంటి.. బంటి అంటూ ఆ ప్రాంతమంతా మార్మోగిపోతోంది. వేలాదిమంది యువతతో ఇసుకేసినా రాలనంతగా ఆ జాగా కిక్కిరిసిపోయింది. ఇబ్రహీంపట్నం కుంభమేళాను మైమరపిస్తోంది ఏంటా అని ఆరా తీస్తే అక్కడ మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి (బంటి) పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఓ యూత్ లీడర్‌కి ఇంతటి ఫాలోయింగా అనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా మారింది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తనయుడు బంటికి యూత్‌లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. గురువారం బంటి పుట్టినరోజు వేడుకలను టీఆర్ఎస్ కార్యకర్తలు నిర్వహించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. నియోజకవర్గంలోని యూత్ అంతా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్దే ఉందంటే నమ్మశక్యం కాదు. శాస్త్రా గార్డెన్ నుంచి క్యాంపు ఆఫీసు వరకు జనాలు కిక్కిరిసి బహిరంగ సభను తలపించింది. పెద్ద పెద్ద క్రేన్ల సాయంతో పూలదండలు, కేకులు తీసుకురావడం గమనార్హం. వుయ్ లవ్ ఎంపీఆర్ అంటూ యువత చేసిన నినాదాలు, డోలు కళాకారుల ఆటపాటలు ముగ్దులను చేశాయి.
సేవా కార్యక్రమాలతో మంచిపేరు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా క్షణాల్లో వాలిపోయే బంటి తీరు అందరినీ తనవైపునకు తిప్పుకుంటోంది. బంటి యూత్ ఫోర్స్ సాయంతో ప్రభుత్వ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో అందేలా చూస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ సహా సంక్షేమ పథకాల చెక్కులు ఇంటింటికీ వెళ్లి పలకరించి అందజేస్తుండంతో బంటిపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఎంకేఆర్ ఫౌండేషన్‌ను స్థాపించి, నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల వేటలో నియోజకవర్గ యువత ముందుండేలా చూస్తున్నారు బంటి. ఫౌండేషన్ స్థాపించిన అనతికాలంలోనే వేలాది మంది యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గొప్ప విశేషం. గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నారు. ప్రభుత్వ ఫలాలు పేదలకు అందేలా చూడటం, సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతుండటం వల్ల గ్రామగ్రామాన బంటికి జనాధరణ పెరిగిపోతోంది.
కేటీఆర్ నోట బంటి మాట
నియోజకవర్గంలోని టీఆర్ఎస్ సీనియర్ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, అందరితో మమేకమై పనిచేస్తుండటం బంటికి ప్లస్ పాయింట్. మొన్నామధ్య మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో యువనేత బంటి అంటూ కేటీఆర్ పలకగానే యువత కేరింతలు కొట్టింది. దీంతో కేటీఆర్ కూడా ఎంతో ఆనందంగా ఏంటి బంటి ఫ్యాన్సా అంటూ ఉత్సాహపరచడంతో యువత ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
ఈసారి ఎమ్మెల్యే టికెట్ కన్ఫమ్?
వచ్చే ఎన్నికల్లో యువనేత ప్రశాంత్‌రెడ్డికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే టికెట్ కన్ఫమ్ అంటూ వ్యాఖ్యలు వినబడుతున్నాయి. మంత్రి కేటీఆర్‌కు సన్నిహితుడవడం, ఇబ్రహీంపట్నంలో బంటికన్నా క్రేజ్ ఉన్న నాయకుడు మరెవరూ లేకపోవడంతో ఆయనకే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయి. సీనియర్లతో కలిసి పనిచేస్తుండటం బంటికి కలిసి వచ్చే అంశం. ఇప్పటికే నియోజకవర్గంలోని గ్రామగ్రామాన తిరుగుతూ బంటి పనిచేసుకుంటున్నారు. కిషన్‌రెడ్డిని రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించడం వెనుక కారణం ఇదేనని చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రతిపక్ష పార్టీలు ఆశాజనక స్థితిలో లేకపోవడంతో బంటి గెలుపు కూడా నల్లేరుపై నడకేనని టాక్.