ప్రధానిని కలిసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత

by Manoj |
ప్రధానిని కలిసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత
X

చండీగఢ్: పంజాబ్ ఎన్నికల్లో అనుహ్యంగా ఓటమిపాలైన కాంగ్రెస్ కు మరో భయం పట్టుకుంది. పార్టీ సీనియర్ నేత, లుధియానా ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టు సోమవారం ప్రధాని మోడీని కలవడం చర్చకు తెరలేపింది. పంజాబ్ సమస్యలను చర్చించేందుకు కలిసినట్లు బిట్టు తెలిపారు. మరోవైపు సన్నిహిత వర్గాలు ఆయన బీజేపీ చేరుతారన్న వార్తలను ఖండించాయి. అయితే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పై పోరాటం చేయాలని కోరినట్లు తెలిపాయి. ప్రధానిని కలిసిన విషయాన్ని షేర్ చేస్తూ బిట్టు ట్వీట్ చేశారు. అయితే ఈ సమావేశం రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. భయపడేంత ఏమి ఈ చర్చలో జరగలేదని పార్టీ నేతలు తెలిపారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడుగా పేరున్న బిట్టూను పార్టీ అలసత్వం చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సీఎం, రాష్ట్ర అధ్యక్షుడు విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed