బస్సు బోల్తా... అందులో 28 మంది ప్రయాణికులు

by S Gopi |
బస్సు బోల్తా... అందులో 28 మంది ప్రయాణికులు
X

దిశ, మిర్యాలగూడ: హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శనివారం తెల్లవారుజమున నార్కెట్ పల్లి- అద్దంకి బైపాస్ రోడ్డుపై మిర్యాలగూడ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..... ఆరెంజ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం రాత్రి 11:30 లకు హైదరాబాద్ నుంచి బాపట్లకు బయలుదేరింది. శనివారం తెల్లవారు జామున సుమారు 3.30 గంటల ప్రాంతంలో పట్టణంలోని నందిపాడు బైపాస్ వద్ద బోల్తా పడింది. బస్సులో మొత్తం 28 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 8 మంది గాయాల పాలయ్యారు. గాయపడిన వారందరినీ మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. బస్సు డ్రైవర్ అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా ప్రయాణికులు ఆరోపించారు.








Advertisement

Next Story