- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండిలో సరిపోనూ పెట్రోల్ లేకపోతే రూ.250 ట్రాఫిక్ చలాన్!!
దిశ, వెబ్‌డెస్క్ః బైక్ తీసి రోడ్డెక్కితే జాగ్రత్తలన్నీ పాటించాల్సిందే! రోడ్డుపైన అన్ని ట్రాఫిక్ సూచనలతో పాటు హెల్మెట్, సైడ్ మిర్రర్స్ అంటూ ప్రతీదీ కౌంటే ఇక్కడ. అయితే, బండిలో పెట్రోల్ ఎంత ఉండాలో అది మాత్రం మన ఇష్టమే.. పెట్రోల్ ఉంటే నడుపుతాం, లేకపోతే రోడ్డు పక్కనే బండి ఆపుకోని, ఎవరి తిప్పలు వాళ్లు పడతారు. కానీ, ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా ట్రాఫిక్ పోలీసులే తీసుకున్నారు. బండిలో పెట్రోల్ సరిపడా ఉంటే తప్ప డ్రైవింగ్ చేయండి, లేకపోతే చలానా తప్పదన్న పరిస్థితికి చేరుకుంది. ఇప్పటి వరకూ, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోతేనో, ఇతరత్రా భద్రతా ప్రోటోకాల్స్ విస్మరించినందుకో జరిమానా విధిస్తే, కేరళలోని ఓ వ్యక్తి తన బైక్‌లో తగినంత పెట్రోల్ లేకుండా ప్రయాణీస్తున్నందుకు చలాన్ అందుకోవాల్సి వచ్చింది. కేరళ ట్రాఫిక్ పోలీసులు పంపిన ఈ-చలాన్ ఫోటోని ఆ వ్యక్తి తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయగా, అది ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.
ఆ వ్యక్తి రాయల్ ఎన్‌ఫీల్ట్‌పైన వెళ్తున్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీస్ ఇచ్చిన ఇ-చలాన్‌లో వ్యక్తి పేరు బాసిల్ శ్యామ్ అని ఉండగా, జరిమానా మొత్తం రూ. 250గా పేర్కొన్నారు. ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన వార్తలు కవర్ చేసే BikeDekho, బాసిల్ శ్యామ్‌ను సంప్రదించినట్లు ఒక నివేదికలో తెలిపింది. వన్-వే రోడ్డులో వ్యతిరేక దిశలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసు ఆపి, ఈ నేరానికి రూ. 250 జరిమానా చెల్లించాల్సిందిగా అడిగారని, దానికి తాను సరే అని వెళ్లిపోయాడు. ఆఫీసుకు వెళ్లిన తర్వాత చలాన్‌ని చూసి అవాక్కయ్యాడు. 'సరిపడా పెట్రోల్ లేకుండా ప్రయాణీకులతో డ్రైవింగ్ చేయడం' కారణంగా చలాన్ కట్టాలని ఉండటంతో ఖంగుతిన్నాడు.
అయితే, భారతీయ మోటారు వాహన చట్టం లేదా కేరళ రాష్ట్ర చట్టంలో ఎవరైనా వాహనాన్ని తక్కువ ఇంధనంతో డ్రైవింగ్ చేయడంపై ఎలాంటి నిషేధం, నిబంధన లేదని నెటిజనులు కొందరు ఆశ్చర్యంతో వెల్లడిస్తున్నారు. ఇక, కేరళ రవాణా చట్టంలో పేర్కొన్న ఏకైక ఇంధన సంబంధిత నేరం ఏమిటంటే, ప్రయాణీకులను గమ్యస్థానానికి చేర్చే ముందు వాణిజ్య వాహనం - వ్యాన్, కారు, బస్సు, ఆటో వంటి వాటిలో ఇంధనం అయిపోతే, అప్పుడు డ్రైవర్ లేదా యజమాని వాహనం రూ. 250 జరిమానా చెల్లించాలి.