- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ-కామర్స్ వ్యాపారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు కోరిన సీఏఐటీ!
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ విక్రయాలను సులభతరం చేసేందుకు వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) చట్టంలో మార్పులు చేయాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. దీనికోసం జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 24, సెక్షన్ 52లను సవరించాలని, తద్వారా చిన్న వ్యాపారాలకు ప్రయోజనాలు లభిస్తాయని ఆదివారం పంపిన లేఖలో సీఏఐటీ పేర్కొంది.
సేవల సరఫరా విషయంలో రూ. 20 లక్షలు, సరుకుల సరఫరాలో రూ. 40 లక్షల కంటే ఎక్కువ అమ్మకాల టర్నోవర్ ఉన్న వ్యాపారాల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసినప్పటికీ, సెక్షన్ 24 కింద ఈ-కామర్స్ పోర్టల్‌లో విక్రయించేందుకు వ్యాపారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో వివరించింది. దేశంలోని చిన్న వ్యాపారుల స్వయం సమృద్ధి కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే డిజిటల్ కామర్స్‌ను వినియోగించుకోవాలనుకునే రిటైల్ వ్యాపారులకు కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్న్నాయి. వారిని పరిష్కరించాలని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ సంయుక్త ప్రకటనలో అన్నారు.