- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత్, ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య ఒప్పందం
దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కీలక ఒప్పందం కుదిరింది. ఆస్ట్రేలియా, భారత్ మధ్య వస్తువుల ఎగుమతులను వంద శాతం టాక్స్ ఫ్రీ గా చేయడమే ఈ ఒప్పందం లక్ష్యం. భారత పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఆస్ట్రేలియా వాణిజ్యం, పర్యాటకం, పెట్టుబడుల మంత్రి డాన్ టెహాన్ వర్చువల్ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా కౌంటర్ స్కాట్ మోరిసన్ సమక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం భారత్‌తో ఆస్ట్రేలియా సన్నిహిత సంబంధాలను మరింతగా పెంచుతుందని మోరిసన్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 27 బిలియన్ డాలర్ల నుంచి 45-50 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని పీయూష్ గోయల్ తెలిపారు.
భారతదేశ 17వ అతిపెద్ద వ్యాపార భాగస్వామి ఆస్ట్రేలియా. 2021లో వస్తువులు, సేవలలో ద్వైపాక్షిక వాణిజ్యం USD 27.5 బిలియన్‌లుగా ఉంది. భారతదేశ వస్తువుల ఎగుమతులు USD 6.9 బిలియన్లు, దిగుమతులు 2021లో USD 15.1 బిలియన్లకు చేరాయి. ఆస్ట్రేలియాకు భారతదేశం చేసే ప్రధాన ఎగుమతుల్లో పెట్రోలియం ఉత్పత్తులు, వస్త్రాలు, దుస్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, తోలు, రసాయనాలు, రత్నాలు, ఆభరణాలు మొదలైనవి ఉన్నాయి. దిగుమతుల్లో ప్రధానంగా ముడి పదార్థాలు, బొగ్గు, ఖనిజాలు, ఇంటర్మీడియట్ వస్తువులు ఉంటాయి.