రబీ సీజన్లో రైతులు పండించిన వాటిని కొనుగోలు చేయాలి: టీపీసీసీ కార్యదర్శి

by Vinod kumar |
రబీ సీజన్లో రైతులు పండించిన వాటిని కొనుగోలు చేయాలి: టీపీసీసీ కార్యదర్శి
X

దిశ, భిక్కనూరు: రబీ సీజన్లో రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలని టీపీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్ లో శుక్రవారం నిర్వహించిన మన ఊరు-మన పోరు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన ఎల్లారెడ్డిలో జరిగే రేవంతన్న పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతుల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని రైతులు, పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. రబీ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం దిగి రాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story