లోక్‌సభలో తెలుగులో మాట్లాడుతూ ఎమోషనల్ అయిన రేవంత్ రెడ్డి

by GSrikanth |
లోక్‌సభలో తెలుగులో మాట్లాడుతూ ఎమోషనల్ అయిన రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభలో టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి తెలుగులో మాట్లాడారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రం, కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన గళమెత్తారు. తెలంగాణ‌లో యాసంగిలో పండే ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్​చేశారు. రాష్ట్ర జనాభాలో 70 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. అందులో వరి పండించే రైతులే అత్యధికమపని ఆయన వెల్లడించారు. ఈ యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో రైతులు వరి పండించారని, దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాబోతోందని తెలిపారు. అయితే ధాన్యం కొనుగోలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకపోవడంపై పార్లమెంట్‌‌లో తూర్పారపట్టారు. కొనుగోలు కేంద్రాలు, రవాణా సౌకర్యాలు, గోనె బస్తాలు కొనకపోవడం, ఎఫ్‌సీఐతో ఒప్పందాలు చేసుకోకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని రేవంత్​రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ అధికారులతో చర్చించి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్​చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రం, కేంద్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులను కష్టపెతున్నారని మండిపడ్డారు. గత వానాకాలం పంట కుప్పలపై పడి 150 మంది రైతులు గుండె ఆగి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి యాసంగిలో అలా జరగకుండా కేంద్ర ప్రభుత్వం చూడాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed