సంగీత అభిమానులకు షాక్.. 33 ఏళ్లకే దూరమైన సింగర్

by Javid Pasha |
సంగీత అభిమానులకు షాక్.. 33 ఏళ్లకే దూరమైన సింగర్
X

దిశ, సినిమా: ప్రముఖ బ్రిటిష్ సింగర్ 'టామ్ పార్కర్' అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. గత రెండేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడుతున్న 33 ఏళ్ల గాయకుడు చిన్న వయసులోనే (బుధవారం) కన్నుమూయడం ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఇక ఈ మరణ వార్తను తన భార్య 'కెల్సీ పార్కర్' సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ కన్నీటి పర్యంతమైంది.

'మా హృదయాలు ముక్కలయ్యాయి. టామ్ చిరునవ్వు, శక్తివంతమైన ఉనికి లేకుండా ఈ జీవితాన్ని ఊహించలేము. చివరి వరకు పోరాడినా నిన్ను దక్కించుకోలేకపోయాం. నీ ప్రేమకు నిజంగా కృతజ్ఞులం. టామ్ ఆశయాల్ని కొనసాగించేందుకు మనమందరం ఏకం కావాలని కోరుతున్నా. మా అందమైన పిల్లలతోపాటు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. టామ్ నేను నీ గురించి గొప్పగా చెప్పుకుంటూ గర్వంగా జీవిస్తాను' అంటూ భావోద్వేగమైన పోస్ట్ రాసుకొచ్చింది.

ఇక బ్రిటీష్-ఐరిష్ బాయ్ బ్యాండ్ 'ది వాంటెడ్'లో టామ్ సభ్యుడు కాగా.. ఆ టీమ్ టామ్‌ను స్మరిస్తూ.. 'విషాదకరమైన వార్తతో కృంగిపోయాం. మా సోదరుడు టామ్ లేడనే నిజాన్ని, అనుభవించే బాధను ఏ పదాలు వ్యక్తపరచలేవు. ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతావ్' అంటూ భావోద్వేగ నివాళులు అర్పించారు.

Advertisement

Next Story