- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హారర్ థ్రిల్లర్‌తో రాబోతున్నటాలీవుడ్ యంగ్ హీరో.. పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్(Aadi Saikumar) వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. త్వరలో ‘షణ్ముఖ’(Shanmukha) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో.. మరో కొత్త సినిమాను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. యుగంధర్ ముని, ఆది సాయి కుమార్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది.
అయితే దీనిని రాజశేఖర్ అన్న భీమోజు, మహీధర్ రెడ్డి (Mahidhar Reddy)నిర్మిస్తున్నారు. తాజాగా, ‘శంబాల’(Shambala) సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను ఆది సాయికుమార్(Aadi Saikumar) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. ఈ పోస్టర్‌లో.. ఒక్క మనిషి కూడా లేని గ్రామం, ప్రళయానికి ముందు భీకరంగా ఉన్న ఆకాశం, మబ్బుల్లో ఓ రాక్షస ముఖం కనిపిస్తోంది. నేచురల్ హారర్ థ్రిల్లర్ జానర్లో శంబాల రాబోతున్నట్లు సమాచారం. ప్రజెంట్ ఈ మూవీ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.