SDT 18 Making Video: నేడు మెగా మేనల్లుడి తేజ్ బర్త్ డే.. SDT 18 నుంచి మేకింగ్ వీడియో విడుదల

by Anjali |   ( Updated:2024-10-15 14:31:58.0  )
SDT 18 Making Video: నేడు మెగా మేనల్లుడి తేజ్ బర్త్ డే.. SDT 18 నుంచి మేకింగ్ వీడియో విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ SDT18 చిత్రం నుంచి మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కోసం మెగా మేనల్లుడు బాడీ కూడా ఫుల్‌గా పెంచినట్లు అర్థమవుతోంది. ఈ పీరియాడికల్ లుక్ లో భారీ యాక్షన్ సినిమాగా ఉండనుందని.. వీడియో వీక్షించిన నెటిజన్లు దర్శక, నిర్మాతలు ఏదో భారీగానే ప్లానే చేసినట్లు తెలుస్తుందని నెట్టింట కామెంట్ల మోత మోగిస్తున్నారు. ‘ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే’ అంటూ ఈ వీడియో లాస్ట్ లో చెప్పగా.. ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో చూసిన సాయి ధరమ్ తేజ్ అభిమానులు ఎగిరిగంతులేస్తున్నారు. ఇక SDT18 చిత్రాన్ని హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రోహిత్ దర్శకత్వంలో రాబోతుంది. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా మెరవనుంది.

Advertisement

Next Story