'వయాగ్రా' ఎప్పుడోచ్చిందో తెలుసా?

by Javid Pasha |   ( Updated:2022-03-27 05:48:59.0  )
వయాగ్రా ఎప్పుడోచ్చిందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: శృంగార సమస్యలు, పురుషుల అంగస్తంభన లోపాన్ని అధిగమించేందుకు ఏకైక పరిష్కారంగా వచ్చిన అద్భుతమైన మందు 'వయాగ్రా'. ఇది ఒక అల్లోపతి ఔషధం కాగా దీని అసలు పేరు 'సిల్డినాఫిల్ సిట్రేట్'. ఈ మాత్ర 1998 మార్చి 27న 'ఎఫ్‌డీఏ' అనుమతి పొందగా పురుషుల లైంగిక సామర్థ్యాన్ని తాత్కాలికంగా తక్షణమే పునరుద్ధరించటంలో ముఖ్యపాత్ర పోషిస్తోందని పలువురు సెక్సాలజిస్ట్‌లు అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలోనే ఈ మందు ఎన్నో చర్చలకు మరెన్నో సంచలనాలకు కేంద్రబిందువైంది. ఎన్నో హెచ్చరికలు, వివాదాలు చుట్టుముట్టాయి. అయినా సరే అంగస్తంభన లోపానికి (ఎరక్త్టెల్ డిస్‌ఫంక్షన్) సమర్థమైన పరిష్కారంగా పురుష ప్రపంచం రెట్టించిన ఉత్సాహంతో వాడటం చెప్పుకోదగ్గ విశేషం. కాగా 1999-2001ల మధ్య 'ఫైజర్' కంపెనీ కేవలం ఈ మాత్ర మీదే ఏటా 100 కోట్ల డాలర్ల వ్యాపారం చేసిందంటే దీనికి లభించిన ఆదరణ ఎంతటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అలాగే పాశ్చాత్య దేశాల్లో ఎన్నో జంటలు విడాకుల వరకూ వెళ్లకుండా ఈ వయాగ్రా ముఖ్యపాత్ర పోషిస్తోందని చెబుతున్న వైద్యులు.. ఎక్కువ కాలం వాడితే కంటి చూపు దెబ్బతింటుందని, గుండె జబ్బు ఉన్నవారు అసలు తీసుకోకూడదని సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed