- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బెంగాల్ స్థానిక సంస్థల్లో టీఎంసీ హవా.. నాలుగు మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలు కైవసం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఎంసీ విజయకేతనం ఎగురవేసింది. సోమవారం వెల్లడించిన ఫలితాల్లో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్ స్థానాల్లో విజయం సాధించింది. సిలిగురి,అసన్ సోల్, బిధాననగర్, చందన్ నగర్ మున్సిపాలిటీల్లో టీఎంసీ ఘన విజయం సాధించినట్లు అధికారులు తెలిపారు. బిధాననగర్‌లో 41 స్థానాలకు గానూ 39 గెలుచుకోగా, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థి చెరొక స్థానంలో గెలుపొందారు. ఇక చందానగర్‌లో 32 సీట్లలో టీఎంసీ 31, సీపీఐఎం ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. మరోవైపు అసన్ సోల్‌లో 160 సీట్లలో టీఎంసీ 91, బీజేపీ ఏడు, సీపీఐఎం రెండు, కాంగ్రెస్ మూడు, స్వతంత్ర అభ్యర్థులు ఒక స్థానంలో విజయం సాధించారు. ఇక సిలిగురిలో దీదీ పార్టీ 37 స్థానాలు, బీజేపీ 5, సీపీఐఎం 4, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందాయి. ఈ విజయం పై సీఎం మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. 'మరోసారి ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. అసన్ సోల్, బిధాననగర్, సిలిగురి, చందన్ నగర్ ఓటర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. టీఎంసీ పట్ల ప్రజలు విశ్వాసాన్ని ఉంచారు' అని ట్వీట్ చేశారు. తాజా విజయంతో మరింత ఉత్సాహంతో అభివృద్ధి పనులకు కట్టుబడి ఉంటామన్నారు.