VenkyAnil3 : త్వ‌ర‌లో వెంకీ-అనిల్ రావిపూడి సినిమా నుంచి టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ ?

by Prasanna |   ( Updated:2024-10-30 16:27:52.0  )
VenkyAnil3 : త్వ‌ర‌లో వెంకీ-అనిల్ రావిపూడి సినిమా నుంచి టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ ?
X

దిశ, వెబ్ డెస్క్ : అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్ లో టాలీవుడ్ సీనియ‌ర్ హీరో వెంక‌టేష్ ( Venkatesh) ఓ కొత్త సినిమాలో న‌టిస్తున్నారు. ఈ మూవీ వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతోంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన ఎఫ్‌-2, ఎఫ్‌-3 సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకీ తెలిసిందే. దీంతో ఈ సినిమా పై ఫ్యాన్స్ కి భారీ అంచ‌నాలే ఉన్నాయి.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేష్ లు హీరోయిన్లు గా న‌టిస్తున్నారు. కామెడీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్ర‌స్తుతం, ఈ సినిమా షూటింగ్ వేగంగా జ‌రుపుకుంటోంది.

తాజాగా, మూవీ టీం ఓ అప్డేట్ ను ఇచ్చింది. ఈ మూవీ షూటింగ్ 90 శాతం పూర్తి అయిన‌ట్లుగా తెలిపింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు జ‌రుగుతున్న‌ట్లు వెల్లడించింది. త్వ‌ర‌లోనే టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు అధికారికంగా తెలిపింది. దీంతో వెంకీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్నీ అనుకున్న సమయానికే అయితే, ఈ సినిమాని సంక్రాంతి కానుక‌గా మన ముందుకు తీసుకొచ్చే ఆలోచ‌న‌లో ఉన్నారని తెలుస్తుంది.

Advertisement

Next Story