ఐఫోన్ అమ్మకానికి తమిళనాడు కల్చర్ హెల్ప్.. మెచ్చిన Apple CEO

by Javid Pasha |
ఐఫోన్ అమ్మకానికి తమిళనాడు కల్చర్ హెల్ప్.. మెచ్చిన Apple CEO
X

దిశ, ఫీచర్స్ : Apple CEO టిమ్ కుక్ తమిళనాడు విద్యార్థులపై ప్రశంసల వర్షం కురిపించాడు. Apple iPhone 13 కెమెరా ఉపయోగించి తీసిన ఫొటోలకు ఇంప్రెస్ అయిన టిమ్.. తమ కమ్యూనిటీల ప్రత్యేకతను కెమెరాలో అద్భుతంగా బంధించారని ప్రశంసించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఆయన.. స్టూడెంట్స్ ఎఫర్ట్స్ గురించి స్పెషల్‌గా మెన్షన్ చేశారు. ఎండ్‌లెస్ స్టోరీస్‌కు కేరాఫ్ అయిన తమిళనాడు భిన్నమైన వ్యక్తులు, విభిన్న సంప్రదాయాలు, డిఫరెంట్ ఫుడ్, ఆర్కిటెక్చర్‌‌తో సందర్శకులను అట్రాక్ట్ చేస్తుంది.

కాగా ఈ డైవర్సిటీని ఓ ఫొటోలో బంధించిన స్టూడెంట్స్ అమేజింగ్ అని కీర్తించాడు. అంతేకాదు తమిళనాడు రిచ్‌నెస్‌‌ను రిఫ్లెక్ట్ చేసిన ఈ ఫొటోస్ ' ఏ ల్యాండ్ ఆఫ్ స్టోరీస్' పేరుతో ప్రసిద్ధ ఎగ్మోర్ మ్యూజియంలో ప్రదర్శితం కానున్నాయని తెలిపాడు. కాగా ఆపిల్ సీఈఓ తమిళనాడు, తమిళ్ కల్చర్ గురించి ఇలా ట్వీట్ చేయడంపై హ్యాపీగా ఫీల్ అవుతున్న స్థానికులు.. మొత్తానికి ఐఫోన్ అమ్ముకునేందుకు మా కల్చర్ యూజ్ అవుతుందని అంటున్నారు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఇది టార్గెటెడ్ మార్కెట్ అంటున్న నెటిజన్లు.. దుబాయ్, యూఎస్ కన్నా ఇండియాలో ఐఫోన్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఆలోచించండి మరి అని సలహా ఇస్తున్నారు.

Advertisement

Next Story