- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అమ్మ చివరి కోరిక.. నా 20 ఏళ్ల కల నిజమైంది.. టాలీవుడ్ హీరో పోస్ట్ దేని గురించంటే?

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు తెలంగాణ కుర్రాడు తిరువీర్(Tiruveer) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పరేశాన్(Pareshan), టక్ జగదీష్(Tuck Jagadish), పలాస్ 1978, జార్జ్ రెడ్డి(George Reddy), కుమారి శ్రీమతి, సిన్, మెట్రో కథలు వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016లో ఇండస్ట్రీకి వచ్చిన తిరువీర్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక ఇటీవల ‘మసూద’ మూవీతో హీరోగా మారాడు. మరీ ముఖ్యంగా తిరువీర్ సమోసా తింటవా శిరీష డైలాగ్ చెప్పి అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పటికీ ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
ప్రస్తుతం పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నాడు. అయినప్పటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తున్నాడు. తాజాగా, తిరువీర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. ఇక ఈ పోస్ట్‌కు అమ్మ చివరి కోరిక.. నా 20 ఏళ్ల కల నిజమైంది. మొత్తానికి నా సొంతంగా ఇల్లు కట్టుకున్నాను’’ అని వెల్లడించారు. భార్యతో కలసి గృహప్రవేశం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తిరువీర్ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అది చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.