దారుణం.. హోంగార్డును కొట్టి చంపిన దుండగులు

by GSrikanth |
దారుణం.. హోంగార్డును కొట్టి చంపిన దుండగులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శేఖర్ అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కొట్టి చంపారు. గోడౌన్ వద్ద మద్యం తాగొద్దని చెప్పినందుకు హోంగార్డుతో గొడవకు దిగి, కిరాతకంగా కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో హోంగార్డు శేఖర్ అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story