- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకట్టుకునే హార్స్ పరేడ్.. కలర్‌ఫుల్ డ్రెస్సుల్లో గుర్రాల హొయలు
దిశ, ఫీచర్స్ : ప్రతీ ప్రాంతానికి ప్రత్యేక ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఉండటం సహజం. వాటికి అనుగుణంగానే పండగలు, జాతర్లు జరుగుతుంటాయి. నైజీరియాలో ఏటా జరిగే 'దర్బార్ ఫెస్టివల్' కూడా ఇలాంటిదే కాగా.. ఇస్లామిక్ పండుగ ఈద్ అల్-అధా ముగింపును సూచిస్తుంది. ఈ సందర్భంగా జరిగే 'హార్స్ పరేడ్' ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది ముస్లింలు, హార్స్ లవర్స్ వస్తుంటారు.
దర్బార్ ఫెస్టివల్ సందర్భంగా కానో, బిడా, సోకోటో, కట్సినాతో సహా అనేక నైజీరియన్ నగరాల వీధుల గుండా సాంప్రదాయ వస్త్రాలు, తలపాగలు ధరించిన పురుషులు.. రంగురంగుల దుస్తులు ధరించిన గుర్రాలను స్వారీ చేస్తూ భారీ ఊరేగింపుగా తరలివెళతారు. ఈ సంవత్సరం కూడా వివిధ ప్రాంతాల నుంచి డజన్ల కొద్దీ గుర్రపు స్వారీదారులు బిడా పట్టణంలో జరిగే ఈ వేడుకలో పాల్గొనేందుకు వచ్చారు. దర్బార్ ఫెస్టివల్‌లో హార్స్ రైడింగ్ సహా సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఈ మేరకు పెద్ద పెద్ద బ్యాండ్స్.. వెస్ట్రన్ ఆఫ్రికన్ సంగీతాన్ని ప్రదర్శిస్తుంటే ఎనర్జిటిక్ డ్యాన్సర్స్, స్టంట్‌మెన్స్ తమ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేస్తారు.
200 ఏళ్ల నాటి చరిత్ర:
దర్బార్ పండుగ 200 సంవత్సరాల నాటిది కాగా, ఆ సమయంలో ఎమిరేట్‌ను రక్షించేందుకు గుర్రాలను యుద్ధంలో ఉపయోగించారు. ఇందుకోసం ప్రతీ కుటుంబంలోని వ్యక్తులు గుర్రపుస్వారీ నేర్చుకోవడం ద్వారా, యుద్ధానికి తమ సంసిద్ధతను తెలియజేసేవాళ్లు. ఈ మేరకు వారంతా ఒక రెజిమెంట్‌గా పని చేయడం ద్వారా ఎమిరేట్‌ను రక్షించాలని భావించారు. అయితే 'ఈద్ అల్-అధా' పండగ సందర్భంగా ఆనాటి వలస పాలనలో చనిపోయే సైనికులకు నివాళులు అర్పించేందుకు ప్రతీ మిలటరీ చీఫ్ గుర్రాన్ని తమ రాజభవనం నుంచి వలసవాదుల కలోనియల్ మాస్టర్ వద్దకు తీసుకువెళ్లే ఉత్తర్వు ఉండేది. అలా వలసరాజ్యాల కాలం నుంచి ఆ ఆచారం కొనసాగుతోంది.
నైజీరియాలో గుర్రం బలం, శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. సాంప్రదాయకంగా గుర్రపు స్వారీ చాలా ముఖ్యమైనది. గుర్రం మీ బలాన్ని సూచిస్తుంది. యుద్ధ సమయంలో మీ వద్ద ఉన్న గుర్రాల సంఖ్యను బట్టి మీరు గెలిచే శక్తి స్థాయిని చూపుతారు. 14వ శతాబ్దం నుంచి నైజీరియన్ సమాజంలో గుర్రాలు ప్రాథమిక పాత్రను పోషించాయి. ఈజిప్ట్, అల్జీరియా, మొరాకోతో సహారా అంతటా వాణిజ్య విస్తరణకు కీలకంగా మారాయి.
- అబూబకర్-బిడా, హార్స్ రైడర్స్ లీడర్