- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్కలు చేసిన పనికి.. గొర్రెల కాపరికి రూ.2.5లక్షల నష్టం
దిశ, కడ్తాల్ : కడ్తాల్ మండలం రావిచెడ్ గ్రామంలో కుక్కల దాడిలో 32 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఆ గ్రామానికి చెందిన కొత్తపల్లి నరసింహ కు చెందిన సుమారు 32 గొర్రెలను శుక్రవారం రాత్రి తన వ్యవసాయ పొలం లో ఉంచాడు. వాటిపై వీధి కుక్కలు దాడి చేసి చంపినట్లు బాధితుడు నర్సింహా తెలిపారు. దాదాపు రూ.2.5లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు. ఈ విషయం తెలుసుకున్న జడ్పీటీసీ, పాక్స్ చైర్మన్, సర్పంచ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, అధికారులతో మాట్లాడి, ఆదుకుంటామని హామీనిచ్చారు.
జరుపుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జడ్పిటిసి దశరథ్ నాయక్ రూ.5వేలు, గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పాక్స్ చైర్మన్ గంప వెంకటేష్ రూ.5వేలు, స్థానిక సర్పంచ్ భారతమ్మ విఠలయ్య గౌడ్ రూ.5వేలు, ముక్త మాదారం సర్పంచ్ సులోచన సాయిలు రూ.5వేలు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యాట నర్సింహా రూ.5 వేలు ఆర్థిక సహాయం గా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ యాదయ్య, ఎఎంసీ డైరెక్టర్ లయక్ అలీ, నాయకులు రమేష్, బాలకృష్ణ, భిక్షపతి, జనార్దన్, సాయి తదితరులు పాల్గొన్నారు.