- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ వాహనాలపై ప్రధాని మోడీ ఫోటో ఉండాలి: బీజేపీ నేతలు
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలపై ప్రధాని నరేంద్రమోడీ ఫోటో పెట్టాలని నెల్లూరు జిల్లా బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకంపై జాతీయ ఆరోగ్య మిషన్ కింద 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని గుర్తు చేశారు. అందువల్ల తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల మీద కూడా ప్రధాని మోడీ ఫోటో ఉంచాలని నెల్లూరు రూరల్ మండల బీజేపీ అధ్యక్షుడు చిలక ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ చక్రధర్ బాబుకు వినతిపత్రం అందజేశారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ను ప్రవేశపెట్టినది స్వర్గీయ అటల్ బీహార్ వాజ్‌పేయీ అని, నేడు ఈ పథకం ద్వారా ఫలాలను, పల్లెలు గిరిజన, తండాలు, మారుమూల ప్రాంతాలకు విస్తరించిందని గుర్తు చేశారు. ఈ అంబులెన్స్‌లు అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను కాపాడటం లోనూ, గర్భిణీ స్త్రీలను, ఆసుపత్రికి తరలించడంలోను కీలక పాత్ర వహిస్తున్నాయని కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో నీలగిరి సంఘం మండల ప్రధాన కార్యదర్శి తిరువీధి నారాయణరావు, తుర్లపటి సాయి, ప్రదీప్, సుమన్, కేశవులు తదితరులు పాల్గొన్నారు.