మద్యం మత్తులో దారుణం.. సొంత అన్ననే హత్య చేసిన తమ్ముడు..

by Satheesh |
మద్యం మత్తులో దారుణం.. సొంత అన్ననే హత్య చేసిన తమ్ముడు..
X

దిశ, అలంపూర్: గ్రామాల్లో చాలామంది మద్యానికి బానిసలై ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే కాక ఇతరుల ప్రాణాలను సైతం తీసేందుకు వెనుకాడడం లేదు. దీనికి ప్రధాన కారణం గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలిసిన మద్యం, బెల్ట్ షాపులే.. మద్యం మత్తులో ఉన్న తమ్ముడు సొంత అన్ననే క్షణికావేశంలో కత్తితో పొడిచి, హత్య చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని చాగపురం గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బోయ చిన్న నరసింహులు మద్యానికి బానిసై తరుచుగా అన్నతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మద్యం మత్తులో తమ్ముడు అన్నతో మరోసారి గొడవపడి కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అలంపూరు సీఐ చందూ నాయక్ తెలిపారు.

Advertisement

Next Story