హిజ్రాపై ప్రేమ.. పెద్దలను ఒప్పించి పెళ్లాడిన యువకుడు

by samatah |
హిజ్రాపై ప్రేమ.. పెద్దలను ఒప్పించి పెళ్లాడిన యువకుడు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆ ట్రాన్స్ జెండర్ పై అతనికి ప్రేమ పుట్టింది. మూడు సంవత్సరాలుగా వీరు ప్రేమించుకుంటున్నారు.. చివరకు ఆ ప్రేమ పెళ్లిగా మారి వారి ఇరువురి జీవితాల్లో ఆనందాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్లితే.. హిజ్రాతో ప్రేమలో పడి, ఆమెను ఓ యువకుడు పెళ్లి చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. జిల్లాలోని ఇల్లెందు గ్రామనికి చెందిన రూపేశ్‌కు అఖిల అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా కలిసి పోయారు.

ఇక ప్రేమలో పడిన వీరు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇలా కొన్ని రోజు సంతోషంగా గడుపుతున్న వారికి అనుకోని విధంగా ఆలోచన తట్టింది. ఇంట్లో పెద్దలకు చెప్పకుండా సహజీవనం చేయడం తప్పుగా భావించారు. దీంతో యువకుడు ఇంట్లోవారికి నచ్చజెప్పి హిజ్రాను వివాహం చేసుకున్నాడు. ఇక ఈ ఘటన ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది.

Advertisement

Next Story