మద్యం మత్తులో కార్ డ్రైవింగ్.. బీభత్సం సృష్టించిన యువకుడు..

by Manoj |
మద్యం మత్తులో కార్ డ్రైవింగ్.. బీభత్సం సృష్టించిన యువకుడు..
X

దిశ, జగిత్యాల టౌన్ : ఓ యువకుడు తప్పతాగి మద్యం మత్తులో అతివేగంగా కార్ డ్రైవింగ్ చేసి జగిత్యాల టౌన్‌లో బీభత్సం సృష్టించాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో గల ఓ రెస్టారెంట్ ఎదుట పార్కింగ్ ప్లేస్‌లో నిలిపి ఉంచిన వాహనాలపై కారు దూసుకెళ్లగా ఘటన బుధవారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జగిత్యాల నుండి కరీంనగర్ వైపు కారులో వెళ్తున్న మోహన్ అనే యువకుడు మద్యం మత్తులో కారును అతివేగంగా నడుపుతున్నాడు. అతివేగం వల్ల కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story