దారుణం.. కొడుకు గొంతు కోసి.. నాలుగో అంతస్తు నుంచి దూకిన తల్లి

by Satheesh |
దారుణం.. కొడుకు గొంతు కోసి.. నాలుగో అంతస్తు నుంచి దూకిన తల్లి
X

దిశ, సికింద్రాబాద్: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక ఓ గృహిణి తన ఏడాది కొడుకు గొంతు కోసి తాను రెండు చేతులు కోసుకుని బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. తల్లి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ హృదయవిదారక ఘటన సికింద్రాబాద్ చిలకలగూడ పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. న్యూమెట్టుగూడకు చెందిన తప్పెట మహేందర్(33)కు మల్కాజిగిరి సఫిల్గూడకు చెందిన దివ్యతేజ(32)తో 2018లో వివాహమైంది. వీరు న్యూమెట్టుగూడలోని నివాసముంటున్నారు. వివాహ సమయంలో మహేందర్‌కు దివ్యతేజ కుటుంబ సభ్యులు రూ.40లక్షల కట్నం, 10 తులాల బంగారు, ఇతర లాంచనాలతో ఘనంగా వివాహం జరిపారు. తాను ఓ ప్రైవేటు కంపనీలో చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నట్లు నమ్మించి పెళ్లి చేసుకున్న మహేందర్.. పెళ్లయినప్పటి నుంచి విధులకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు.

కాగా ఇతని ఉద్యోగంపై దివ్యతేజ కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. మహేందర్ సీఏ కాదని తేలింది. దీంతో భార్యాభర్తల మధ్య అప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి. గత ఏడాది మార్చి 3న వీరికి బాబు రిత్విక్(01) పుట్టాడు. అప్పటి నుంచి గొడవలు మరింత ఎక్కువయ్యాయి. అదనపు కట్నంతేవాలంటూ అత్త, ఆడపడుచూ, మరిది, భర్త అంతా కలిసి దివ్య తేజను వేధించసాగారు. ఈనెల 7న భర్త తనతో గొడవ పడి బంగారు నగలు ఇవ్వాలంటూ వేధించడంతో ఆమె సఫిల్గూడలోని తన పుట్టింటికి వెళ్లింది. ఆమె వద్ద ఉన్న బంగారు నగలన్నింటిని తన పుట్టింటిలో వదిలేసి ఈనెల 13న తిరిగి మెట్టుగూడకు వచ్చింది. భార్యతో తరచూ గొడవ పడి మానసిక వేధింపులకు గురిచేస్తున్న మహేందర్ అప్పటికే అదే ప్రాంతంలో నివాసముండే మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసి ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవలు జరిగాయి.

ఇదే క్రమంలో సోమవారం ఇద్దరు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన దివ్యతేజ ఆమె తమ నివాసానికి ఎదురుగా ఉన్న భవనం నాలుగో అంతస్తుకు తన యేడాది బాబుతో వెళ్లింది. అక్కడే తన ఇంట్లో నుంచి తీసుకు వెళ్లిన శానిటైజర్ తాగింది. తరువాత తన కొడుకు గొంతు కోసి తన రెండు చేతులను, గొంతుపై బ్లేడ్తో కట్ చేసుకుంది. అంతటితో ఆగకుండా భవనం నాలుగో అంతస్తు నుంచి తన బాబు సహా కిందకు దూకింది. దీంతో బిల్డింగ్ కింద పార్క్ చేసిన బైక్‌పై పడటంతో ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయి. ఇతర అవయవాలకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని దివ్యతేజను సికింద్రాబాద్లోని శ్రీకర్ ఆసుపత్రికి తరలించారు. దివ్యతేజ భర్త మహేందర్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed