ముగిసిన వింగ్స్ ఇండియా ఎయిర్ షో.. భారీగా తరలివచ్చిన సందర్శకులు

by Manoj |
ముగిసిన వింగ్స్ ఇండియా ఎయిర్ షో.. భారీగా తరలివచ్చిన సందర్శకులు
X

దిశ, బేగంపేట: పౌర విమానయాన , మంత్రిత్వ శాఖ , ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన వింగ్స్ ఇండియా 2022 విమానాలు , హెలిపాడ్ ప్రదర్శన ఆదివారం ముగిసింది . ఈ నెల 24న ప్రారంభమైన ఈ ప్రదర్శన మొదటి రెండు రోజులు వ్యాపార లావాదేవీల కోసం కేటాయించగా 28, 27 తేదీ రెండు రోజులు సామాన్య ప్రజల సందర్శనకు అనుమతించారు . ఈ రెండు రోజులు నగర వాసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వచ్చి విహంగాలను , ఎయిర్హో విన్యాసాలను తిలకించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు . ఆదివారం ఉదయం 12 గంటలకు , తిరిగి సాయంత్రం 4 గంటలకు 9 హెలికాప్టర్లు ఆకాశంలో చేసిన పలు రకాల విన్యాసాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకున్నాయి . చిన్నా పెద్దలతో పాటు కుటుంబ సభ్యుల సమేతంగా సందర్శకులు బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌లో ఏర్పాటు చేసిన విమానాలు , హెలికాప్టర్లు వాటి విడిభాగాలు ప్రదర్శనను తిలకించారు . రెండు రోజుల పాటు 80 వేల మంది సందర్శకులు ఈ షోను సందర్శించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.







Advertisement

Next Story