- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైక్ అదుపు తప్పి కింద పడి వీఆర్వో మృతి
దిశ, పరిగి : విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న ఓ వీఆర్వో బైక్ అదుపుతప్పి కింద పడి మృతి చెందాడు. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం దోమ మండలం బుద్దాపూర్ గ్రామానికి చెందిన ఆశన్న(48) భార్య గోపమ్మ వీరికి ప్రమీల, వెంకటేష్, రవి అను ముగ్గురు సంతానం ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట్ మండలంలో ఆశన్న వీఆర్వో విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకొని ఆశన్న, దోమ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన బోయిన శ్రీనివాస్ ఇద్దరు కలిసి మోటారు సైకిల్‌పై శుక్రవారం రాత్రి హైవే 163 పై రంగంపల్లి శివారులో వస్తున్నారు. ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ప్రయాణికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తీవ్రగాయాలైన ఆశన్న, శ్రీనివాస్ లను పరిగి ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. ఆశన్న పరిస్థితి విషయమంగా ఉండటంతో పరీక్షలు చేస్తుండగా మృతి చెందాడు. గాయాలైన బోయిన శ్రీనివాస్‌ను మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి రెఫర్ చేశారు.